Home / SLIDER / దేశానికి కరదీపిక తెలంగాణ!

దేశానికి కరదీపిక తెలంగాణ!

‘రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యం’అని చదువుకున్నాం. ఇప్పుడు రవి అస్తమించని తెలంగాణ ప్రగతి’ అని చదువుకోవాలి! అతిశయ వాక్యం కాదిది, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలో తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి సాక్షి ఇది!దక్షిణ భారతదేశం అంటే ఢిల్లీ రిపబ్లిక్‌ డే పరేడ్‌లో శకటాలు కూడా దిక్కులేని ప్రాంతం అనే స్థాయికి నేడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దిగజార్చింది. కానీ, మన దక్షిణాపథపు భౌగోళిక, నైసర్గిక, రాజకీయ, సాంస్కృతిక ఉత్కృష్టతలు చెప్పనలవి కానివి. వ్యవసాయం, చేనేత, సాఫ్ట్‌వేర్‌, రక్షణరంగ పరిశోధన, సెల్యులార్‌/ మాలిక్యులార్‌ బయాలజీ పరిశోధన, రియల్‌ ఎస్టేట్‌, ఫార్మా, విద్యారంగం, చలనచిత్ర రంగాలకు పేరుగాంచినం మనం. విభిన్న రంగాలలో తెలుగు కీర్తి రెపరెపలాడించిన మహనీయులు ఎందరో. రాజకీయరంగంలోనైతే దేశ రాష్ట్రపతిగా, ప్రధానిగా, ఉప రాష్ట్రపతిగా, లోక్‌సభ స్పీకర్‌గా తెలుగు తేజస్సు రాణించింది. ఇప్పుడు దేశ యవనికపై తెలంగాణ ప్రభ వికసింపజేస్తున్నది మాత్రం సాహితీసమరాంగణ సార్వభౌముడు, సమర్థ పాలకుడు, క్రాంతదర్శి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాత్రమే!

దశాబ్దాలుగా అన్నింటా వెనకబడిన తెలంగాణ విముక్తి కోసం సకలజనులను జాగృతపరిచిన రాజకీయ నాయకత్వం, అనుకున్నది సాధించే ఆత్మబలం, అందుకు తగిన కార్యశూరత, మొక్కవోని దీక్ష వల్ల అసాధ్యాలను సుసాధ్యం చేసిన నాయకుడు కేసీఆర్‌. ఉద్యమాలు, విప్లవాలు చేసి, రాజ్యాధికారంలోకి వచ్చిన లాటిన్‌ అమెరికా దేశాలైన క్యూబా, బొలీవియా సహా చైనా, రష్యా, లాంటి దేశాల్లో మినహా ఉద్యమ నేపథ్యం కలిగి, స్వపరిపాలన సాధించి, సుపరిపాలననూ అందిస్తున్న చరిత్ర దేశంలో ఒక్క టీఆర్‌ఎస్‌కే ఉన్నదనేది కాదనలేని సత్యం. ఏమీ లేని నిస్సారమైన భూముల్లో సింగపూర్‌ లాంటి దేశాన్ని సృష్టించి ఆసియా టైగర్‌లా నిలిపిన ‘లీ క్వాన్‌ యూ’కి ఏ మాత్రం తీసిపోరు కేసీఆర్‌. అటు సామ్యవాదం ద్వారా సాధించగలిగే సమత, ఇటు క్యాపిటలిజం ద్వారా సాధించగలిగే అభివృద్ధి- సంక్షేమం చేసి చూపిస్తున్నారు కేసీఆర్‌. ఇదంతా కేవలం ఏడున్నరేండ్లలో మన కండ్లముందు జరగడం అబ్బురం. ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ సాక్షిగా మీకు పరిపాలించే ముఖం లేదు’ అన్నరు. ‘తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వం, ఏం చేసుకుంటరో చేసుకోండి’ అన్నరు. మరిప్పుడు? అన్నిరంగాల్లో దేశంలోనే టాప్‌ ఫైవ్‌లో మనం ఉన్నం. మనోళ్లు ఇక్కడ ఒక ఎకరా భూమి అమ్ముకుంటే ఆంధ్రాలో పదెకరాలు కొనేలా దశ తిరిగింది. కేసీఆర్‌ చెప్పినట్టు ‘మన తెలంగాణ కోటి ఎకరాల మాగాణ’ నేడు. హేళన చేసిన గొంతులు మూగబోయే ప్రగతి మనది.

స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడచిన సందర్భంగా దేశమంతా ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ చేసుకుంటున్నా.. పేరు గొప్ప ఊరు దిబ్బ బీజేపీ పాలనలో దేశం మతపరమైన భావోద్వేగాలతో కునారిల్లుతున్నది. 2014కు ముందు గుజరాత్‌ మోడల్‌ అంటూ, అదే దేశమంతా చూపిస్తామని ఊదరగొట్టిన పార్టీ నేడు వెల్లకిలా పడుతున్నది. మన రైతు బంధు, మన భగీరథ, మన మిషన్‌ కాకతీయ పథకాలను బీజేపీ ప్రభుత్వాలు కాపీ కొడుతున్నయి. దేశమంతా తెలంగాణ మోడల్‌ వినా మార్గం లేదు! పలు రాష్ర్టాలు, ముఖ్యంగా బీజేపీ పాలనలోని ఉత్తర భారతదేశం అన్ని అభివృద్ధి సూచీలలో వెనకబడిపోతూండగా, తెలంగాణ అభివృద్ధి- సంక్షేమం- మౌలిక సదుపాయాల కల్పనలో మరెవరికీ అందనంత వేగంగా ఫలితాలు సాధిస్తున్నది. తెలంగాణ పనితీరును, విధానాలను ఆర్‌బీఐ, నీతి ఆయోగ్‌ సహా కేంద్రమంత్రులు, అంతర్జాతీయ సంస్థలు ప్రశంసించని రోజు లేదు. గుజరాత్‌ లేదా యూపీ గతిని ఈ సంస్థలు మెచ్చుకుంటున్న దాఖలాలున్నయా? పోనీ కేంద్ర మంత్రులైనా వారి రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశంసించగలిగే పరిస్థితులున్నయా?

రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, తాత్విక, ఆధ్యాత్మిక చింతనతో సమగ్రాభివృద్ధి మోడల్‌గా తెలంగాణను నిలపడం కేసీఆర్‌ వల్లే సాధ్యమైంది. చతురత, లౌక్యం, సమయస్ఫూర్తి, గల్లీలోనైనా, ఢిల్లీలోనైనా క్రియాశీల కార్యశూరత, రాజకీయ/ అధికార శ్రేణుల్లోని అనుభవజ్ఞుల సేవలను రాష్ట్రం కోసం ఉపయోగించే హృదయ వైశాల్యం వీటిలో ఆయనకు ఆయనే సాటి!
ఇప్పుడు మన మోడల్‌ దేశవ్యాప్తం కావాలని ఈ వ్యాస రచయితలు ఎందుకు అంటున్నరంటే… ఎన్నో త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణ, సమర్థ పాలనతో ప్రగతిపథంలో నిలుపుతున్న తెలంగాణ నేడు కేంద్ర ప్రభుత్వ దుందుడుకు విధానాల కారణంగా తీవ్ర అన్యాయానికి గురవుతున్నది. రాజ్యాంగం, ఫెడరల్‌ వ్యవస్థ నామమాత్రమైనయి. ఒక్కొక్కటిగా రాష్ర్టాల హక్కులను కేంద్రం హరిస్తున్నది. వ్యవసాయ సంక్షోభాన్ని నివారించాలని ముఖ్యమంత్రి స్వయంగా మంత్రివర్గంతో ఢిల్లీ పలుమార్లు పోయి నా కనీసం అపాయింట్‌మెంట్‌ ఇవ్వని దుర్మార్గం బీజేపీది. అగ్గిపెట్టెలో చీరను ఆవిష్కరించే తెలంగాణ వన్నె అయిన చేనేతను జీఎస్టీ పరిధిలోకి చేర్చి స్లాబ్‌ పెంచే కుట్ర చేస్తున్నరు. కేంద్ర ప్రభుత్వం ‘స్మార్ట్‌ సిటీస్‌’లో అర్హత, అవసరం, అవకాశం ఉన్న ఎన్నో తెలంగాణ నగరాలకు చోటుకల్పించకపోవడం కూడా వివక్షను ఎత్తిచూపుతున్నది. ప్రాజెక్టులకు రూ.7800 కోట్ల మేర కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని మంత్రి కేటీఆర్‌ విజ్ఞప్తి చేసినా పట్టించుకునే పరిస్థితి లేదు.

తెలంగాణ రాష్ట్రం వచ్చి ఏడేండ్లు దాటుతున్నా విభజన హామీలను కేంద్రం గాలికి వదిలేసింది. రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా,వెనుకబడిన జిల్లాలకు నిధులు, షెడ్యూల్‌ 9, 10లోని సంస్థల విభజన, అసెంబ్లీ స్థానాల పెంపు ఇవన్నీ పార్లమెంట్‌ సాక్షిగా హామీ పడినవి. అయినా తీవ్ర అన్యాయం చేస్తూ ఈ డిమాండ్లను అటకెక్కించింది కేంద్రం.

సివిల్‌ సర్వెంట్స్‌ను తమ ఇచ్చం వచ్చినట్టు, రాష్ర్టాలను, అధికారులనూ సంప్రదించకుండా కేంద్ర సర్వీసుల్లోకి రప్పించుకోవడం కోసం ఒక దుర్మార్గమైన చట్టాన్ని కూడా తేబోతున్నది. మరీ దారుణమేమంటే, రాష్ట్రంలో ట్రాన్స్‌ఫర్స్‌ కూడా కేంద్రం తన నియంత్రణలోకి తీసుకోజూడటం. తమకు వంతపాడని రాష్ర్టాల పాలనలో కేంద్ర ఏజెన్సీల ద్వారా జోక్యం చేసుకోవడం, అయినా దారికి రానివారిపై రాజ్యాంగసంస్థల ద్వారా బలప్రయోగం చేయబూనడం దుర్మార్గాల్లోకెల్లా దుర్మార్గం. కేంద్ర ప్రభుత్వ ఈ దాష్టీకాన్ని బలంగా నిరసించే, తిరగబడే వారిలో కేసీఆర్‌ది ప్రముఖ పాత్ర. సమాఖ్యస్ఫూర్తికి తూట్లు పొడుస్తున్న మోదీకి లేఖ రాసిన కేసీఆర్‌ దేశవ్యాప్త బీజేపీయేతర పార్టీల నాయకులను కూడగట్టగలరు.

దేశానికి అత్యధిక ఆదాయం ఇస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణది ఐదవ స్థానం. దేశ నిర్మాణంలో ఇంత కీలక పాత్ర పోషిస్తున్న మన రాష్ట్రం పట్ల, దక్షిణాది పట్ల, దేశవ్యాప్త బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాల పట్ల వివక్ష పోవాలంటే తిరగబడాలి. ‘ఎందుకో సందేహమెందుకో… రానున్న విందులో నీ వంతు అందుకో’ అని శ్రీశ్రీ అన్నట్టు మన సీఎం నేతృత్వంలో తెలంగాణ జైత్రయాత్ర దేశానికే మహర్దశ పట్టించగలిగే ఆ శుభసంకల్పంలో మన వంతు అందుకుందాం. కేసీఆర్‌ సైన్యంగా మనమంతా రంగంలోకి దిగుదాం. ఆ సమయం ఇప్పుడే! జై తెలంగాణ.. జై భారత్‌..

తెలంగాణ సిగలో కీర్తికిరీటాలు!
మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ ద్వారా తీరిన సాగు, తాగునీరు కొరత. రికార్డు సమయంలో కాళేశ్వరం భారీ ప్రాజెక్ట్‌ నిర్మాణం. దేశంలోనే తొలిసారి రైతుబంధు, రైతు బీమా అందించిన ఆదర్శ పాలన. పాడి, పశు, మత్స్య సంపద గణనీయంగా పెరుగుదల. తత్ఫలితంగా క్షీర, నీలి విప్లవం సాకారం. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా రాష్ట్రమంతా హరితమయం. ప్రగతిలాగే, ఉబికుబికి పైకొస్తున్న పాతాళగంగ! నిమ్స్‌, టిమ్స్‌, గాంధీ, నీలోఫర్‌ దవాఖానల ద్వారా నాణ్యమైన వైద్య సేవలు. జిల్లా, ఏరియా, నియోజకవర్గాలకూ విస్తరిస్తున్న సదుపాయాలు. కొవిడ్‌ మహమ్మారి జనజీవితాన్ని అతలాకుతలం చేస్తున్న వేళ దేశంలోనే తొలిసారిగా ఇంటింటి జ్వర సర్వే, హోం ఐసోలేషన్‌ కిట్స్‌ అందజేత. సీఎం స్వయంగా పర్యవేక్షణ.గురుకులాలకు మహర్దశ. వచ్చే ఏడాది నుంచి తెలుగు మాధ్యమానికి సమాంతరంగా ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకొని తెలంగాణ తన పౌరులను పోటీ ప్రపంచానికి సిద్ధం చేస్తున్నది.
సుస్థిర పాలన, శాంతిభద్రతల పరిరక్షణ, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు, రోడ్‌ నెట్‌వర్క్‌, పారదర్శక విధానాల కారణంగా తెలంగాణలో పెట్టుబడుల వెల్లువ. ఉద్యోగ/ ఉపాధి అవకాశాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాల పెంపు.

అంతర్జాతీయ సంస్థ మెర్సర్‌ కీర్తించిన ‘బెస్ట్‌ లివబుల్‌ సిటీ’ హైదరాబాద్‌. దేశంలోనే మొదటి గ్యాస్‌ ఇన్సులేటెడ్‌ 400 కేవీ సబ్‌ స్టేషన్‌ ఏర్పాటు ద్వారా ఒక్క క్షణం కూడా కరెంట్‌ పోకుండా నగరం చుట్టూ విద్యుత్‌ వలయం.సామాజిక న్యాయ సాధన దిశలో ముందడుగు-అణగారినవర్గాల కోసం దళితబంధు దేశంలోనే మహత్తర విప్లవం. ప్రతిపక్షాల నిరర్థక ఆరోపణలను తిప్పికొట్టేలా డైరీ, పౌల్ట్రీ లాంటి వెంచర్స్‌ కోసం దళితబంధు సొమ్ము ఉపయోగిస్తున్న దళితులు. వారి స్వావలంబన కోసం కేసీఆర్‌ పడుతున్న తపనకు తోడైన దళితుల ఔత్సాహికత!సర్వమత సమత్వ భావనతో అన్నిమతాల వారూ ప్రశాంతంగా జీవించే కృష్ణా- గోదావరీ తెహజీబ్‌.జగద్గురు రామానుజాచార్యుల స్ఫూర్తి కేంద్రంతో హైదరాబాద్‌కు ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిగా గుర్తింపు. ప్రాంగణంలో కూర్చొని ఉన్న 216 అడుగుల సమతామూర్తి విగ్రహం.యాదాద్రి శ్రీ నృసింహ క్షేత్రం మరొక ఆధ్యాత్మిక సంపద. తెలంగాణకే మకుటాయమానం

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat