విరాట్ కోహ్లిని కెప్టెన్సీ నుంచి తప్పించడంపై విమర్శలు ఎదుర్కొంటున్న బీసీసీఐకి మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ మద్దతుగా నిలిచారు. ‘అభిమానులు వరల్డ్ కప్ వంటి ఐసీసీ ట్రోఫీలు గెలవాలని ఆశిస్తున్నారు.
అంతేకానీ ర్యాంకులు, సిరీస్ల గురించి కాదు. అందుకే కోహ్లి ఇబ్బంది పడుతున్నాడు. ఐసీసీ ట్రోఫీ నెగ్గకపోవడమే కోహ్లిపై వేటుకు కారణం. బీసీసీఐ అతడిని తప్పించి రోహిత్ పగ్గాలు అప్పగించడం సరైందే’ అని ఆయన అన్నారు.