సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా తమ్మినేని వీరభద్రం మూడోసారి ఎన్నికయ్యారు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్లో జరిగిన పార్టీ రాష్ట్ర మహాసభలో ఆయనను మరోసారి ఎన్నుకుంటూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. 2014లో రాష్ట్రం విడిపోయిన అనంతరం సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా తొలిసారి ఎన్నికైన వీరభద్రం.. 2018లో రెండో సారి ఆ బాధ్యతలు చేపట్టారు. మరో రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో పార్టీ కేడర్ వీరభద్రంపైనే నమ్మకం ఉంచింది. కాగా, మంగళవారం జరిగిన సభలో మొత్తం 60 మంది సభ్యులతో కూడిన రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు.
