తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. మెగాస్టార్ చిరంజీవి కొవిడ్ బారిన పడ్డారు. తాజాగా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. థర్డ్ వేవ్ మొదలైనప్పటికి పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతున్న సంగతి తెలిసందే.
ఈ క్రమంలోనే తాజాగా చిరంజీవికి కరోనా వైరస్ సోకింది. ప్రస్తుతం ఆయన హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు. ఇక ఇటీవల ఆయనను కలిసిన వారందరూ టెస్ట్ చేయించుకోవలసిందిగా ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా, చిరు కోవిడ్ బారిన పడిన విషయం తెలిసిన అభిమానులు ..ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నారు.