తెలుగు సినిమా ఇండస్ట్రీలో శతాధిక చిత్రాల్లో నటించి మెప్పించిన హీరో శ్రీకాంత్. ప్రస్తుతం కేరక్టర్ ఆర్టిస్ట్‌గానూ, విలన్ గానూ సత్తాచాటుకుంటున్నారు. ఇటీవలే ఓ సీనియర్ హీరో సినిమాలో విలన్‌గా నటించి మంచి క్రేజ్ తెచ్చుకున్నారు.
ఈ క్రమంలో ఆయనకి మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. శ్రీకాంత్ తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఈ రోజు (బుధవారం) సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ‘మిత్రులారా.. అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ.. నాకు కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
కొద్ది రోజులుగా స్వల్ప లక్షణాలు కనిపిస్తున్నాయి. నాతో కాంటాక్ట్ లో ఉన్నవారికి ఎవరికైనా ఆ లక్షణాలున్నట్టైతే.. వెంటనే కోవిడ్ టెస్ట్ చేయించుకోండి’ అని ట్విట్టర్ వేదికగా అభ్యర్ధించారు శ్రీకాంత్.