సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తున్న సంగతి తెల్సిందే. ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో మహేష్ బాబు సరసర మహానటి కీర్తి సురేష్ అందాలను ఆరబోయడానికి.. రోమాన్స్ చేయడానికి సిద్ధమైంది.
ఈ మూవీ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించనున్నాడు అని తెలుస్తుంది. గతంలో త్రివిక్రమ్ నేతృత్వంలో అతడు,ఖలైజా చిత్రంలో నటించిన మహేష్ తాజాగా మూడో చిత్రానికి రెడీ అవుతున్నాడు.
ఈ మూవీలో ప్రస్తుతం మంచి జోష్ లో ఉన్న పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రంలో మహేష్ బాబుకు మావయ్య పాత్రలో డైలాగ్ కింగ్ సీనియర్ నటుడు మోహన్ బాబు నటిస్తున్నాడు అని చిత్రం యూనిట్ చెబుతుంది. గతంలో కృష్ణ హీరోగా వచ్చిన కొడుకు దిద్దిన కాపురంలో మహేష్ బాలనటుడుగా డ్యూయల్ పాత్ర చేయగా ఇందులో మోహన్ బాబు విలన్ గా నటించాడు. దాదాపు మూడు దశాబ్ధాల తర్వాత మహేష్ మోహన్ బాబు నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఫిబ్రవరి నెల నుండి మొదలు కానున్నది.