తమిళస్టార్ హీరో సూర్య ప్రధానపాత్రలో నటించిన ‘జై భీమ్’ మరోసారి సత్తా చాటింది. నోయిడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ సినిమా 3 అవార్డులు గెలుచుకుంది. ఈ 3 ఉత్తమ నటుడిగా సూర్య, ఉత్తమ నటిగా లిజోమోల్ జోస్ను అవార్డులు వరించాయి.
వీటితో పాటు ఉత్తమ చిత్రంగానూ ఈ మూవీ నిలిచింది. జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రముఖ రేటింగ్ సంస్థ IMDBలో అత్యధిక రేటింగ్ దక్కించుకున్న మూవీగా రికార్డులకు ఎక్కింది.