దేశంలో ప్రస్తుతం ఎక్కడ చూసిన కానీ కరోనా ఉద్ధృతి కొనసాగుతుంది. అయితే గడిచిన ఇరవై నాలుగు గంటల్లో మాత్రం కరోనా ఉధృతి మాత్రం కాస్త స్వల్పంగా తగ్గింది. గడిచిన 24గంటల్లో కొత్తగా 2,55,874 మందికి కరోనా సోకింది.
నిన్నటితో పోల్చితే 50,190 కేసులు తక్కువగా నమోదయ్యాయి. కాగా పాజిటివిటీ రేటు 20.75శాతం నుంచి 15.52శాతానికి తగ్గింది. 614మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 22,36,842 యాక్టివ్ కేసులున్నాయి.