మెగా కాపౌండ్ నుండి వచ్చిన వైష్ణవ్ తేజ్ హీరోగా.. కేరళ కుట్టి కృతి శెట్టి హీరోయిన్ గా విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో వచ్చిన ఉప్పెన మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో పలు రికార్డులకు కేంద్ర బిందువుగా.. అనేక సంచలనాలకు తెరతీసిన సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు. బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మంచి కలెక్షన్లతో పాటు మంచి పేరు కూడా తెచ్చుకుంది.
ఈ చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న బుచ్చిబాబు తాజాగా టాలీవుడ్ కు చెందిన స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో సినిమాకు రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. బుచ్చిబాబు జూనియర్ కు కథ చెప్పినట్లు. జూనియర్ దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఆ వార్తల సారాంశం . అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ తన ముప్పై చిత్రాన్ని హిట్ చిత్రాలకు.. రికార్డులకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన కొరటాల శివతో చేయడానికి సిద్ధమయ్యాడు అంట .
ఈ చిత్రం తర్వాత బుచ్చిబాబు సాన జూనియర్ ఎన్టీర్ కు చెప్పిన కథతో చిత్రం తెరకెక్కించనున్నాడు అని ఆర్ధమవుతుంది. ఏది ఏమైన చిన్న హీరోతో మొదలైన బుచ్చిబాబు సాన ప్రస్థానం అనతికాలంలోనే స్టార్ హీరోతో సినిమాను తెరకెక్కించనుండటం నక్కతోక తొక్కినట్లే కదా . చూడాలి మరి ఈ చిత్రం ఎన్ని సంచనాలకు కేంద్ర బిందువుగా మారుతుందో..?