ఇటీవల తన భార్య ఐశర్య నుండి విడాకులు తీసుకుని వార్తల్లో ప్రధానంగా మారిన కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తెలుగులో ఇప్పటివరకు స్ట్రైట్ మూవీ చేయలేదన్న సంగతి మన అందరికి తెల్సిందే. ఇప్పటివరకు తమిళంలో తాను నటించిన చిత్రాలనే తెలుగులో డబ్బింగ్ ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు అందించాడు ధనుష్. తమిళ సినిమాలే అయిన కానీ తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నాడు ధనుష్.
అయితే చానా ఏండ్ల తర్వాత తొలిసారిగా తెలుగులో స్ట్రైట్ మూవీగా తెరకెక్కుతున్న వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెలుగు ,తమిళంలో తీస్తున్న చిత్రం “సార్”. ఈ చిత్రం యొక్క షూటింగ్ హైదరాబాద్ నగరంలో పెట్టుకుంది చిత్రం యూనిట్. దీనికి సంబంధించిన సెట్టింగ్ అన్ని పూర్తయ్యాయి. అయితే హైదరాబాద్ లో జరగనున్న సార్ చిత్రం షూటింగ్ మొత్తం హీరో ధనుష్ పైనే చిత్రీకరీంచాల్సి ఉంది.
ఈ క్రమంలో హీరో ధనుష్ కు కరోనా పాజిటీవ్ రావడంతో చిత్రం యొక్క షూటింగ్ కార్యక్రమాలు ఆగిపోయాయి.గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ధనుష్ పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటీవ్ అని తేలింది. దీంతో సార్ చిత్రం షూటింగ్ కు సడెన్ బ్రేక్ పడింది. హీరో ధనుష్ కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందో అప్పటివరకు ఈ చిత్రం షూటింగ్ ఆగిపోయినట్లే అని ఆర్ధమవుతుంది.