ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి పెరుగుతోంది. రోజువారీ కేసులు సుమారు 15వేలు నమోదవుతున్నాయి. వారం రోజుల వ్యవధిలో విపరీతంగా కేసులు పెరిగాయి. దీంతో ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు తరహాలో ఏపీలోనూ లాక్డౌన్ విధించాలని డిమాండ్ వినిపిస్తోంది.
వైరస్ వ్యాప్తి కట్టడికి మిగతా రాష్ట్రాల మాదిరిగానే ఏపీలో సైతం కఠిన ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. అయితే మరోవైపు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే రాత్రి కర్ఫ్యూ కొనసాగుతోంది.