తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో గడిచిన గత 24 గంటల్లో 1,421 కరోనా కేసులు నమోదైనట్లు హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 1,72,700 కరోనా కేసులు నమోదయ్యాయి.
కరోనా చాపకింద నీరులా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి.. జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. టీకాలు తప్పనిసరిగా వేసుకోవాలన్నారు. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గర్లోని ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలని పేర్కొన్నారు.