వరుస ఓటములతో ఉన్న టీమిండియాకు డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. చాలా ఏళ్లుగా జట్టుకు శుభారంభాన్ని అందిస్తూ, భారీ స్కోర్లు చేసే రోహిత్ సౌతాఫ్రికా టూర్కు అందుబాటులో లేకపోవడంతో భారత్ తడబడింది.
సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో రోహిత్ లేకుండా జరిగిన చివరి 10 వన్డేల్లో భారత్ తొమ్మిదింట్లో ఓడిపోయింది. ఒకటే గెలిచింది. దీన్ని బట్టి టీమిండియాకు హిట్ మ్యాన్ ఎంత ముఖ్యమో తెలుస్తోంది.