ఏపీలో చిత్తూరు జిల్లాలో ఎస్సీ మహిళను హింసించిన పోలీసులను తక్షణమే అరెస్టు చేయాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన నేత,మాజీ మంత్రి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. జైలు సూపరింటెండెంట్ ఇంట్లో చోరీ కేసులో పని మనిషి ఉమామహేశ్వరిని పోలీసులు అన్యాయంగా నిర్బంధించి, చిత్రహింసలు పెట్టారని ఆయన ఫైరయ్యారు.
ఏపీలో సీఎం జగన్ పాలనలో ఎస్సీలు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. కాగా, ఈ నెల 19న తనను పోలీసులు విపరీతంగా కొట్టారని బాధిత మహిళ కన్నీరుమున్నీరవుతోంది.