ఏపీలో చిత్తూరు జిల్లా తిరుపతి ఐఐటీలో కరోనా కలకలం రేపుతోంది. ఐఐటీ క్యాంపస్లో 214 మంది విద్యార్థులు, సిబ్బందికి కరోనా టెస్టులు చేయగా.. 40 మంది విద్యార్థులు, 30 మంది సిబ్బందికి పాజిటివ్ గా తేలింది. వీరందర్నీ క్యాంపస్ లోని ఐసోలేషన్లో ఉంచారు. ఈ నెల మొదటి వారంలో 600 మంది విద్యార్థులు సొంత ఇళ్లకు వెళ్లడంతో కొందరు మాత్రమే క్యాంపస్లో ఉన్నారు.
