దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న కేసుల్లో తాజాగా పెరుగుదల కనిపించింది. కాగా.. ఒక్కరోజే 45 మంది కరోనా వల్ల మరణించారు. థర్డ్ వేవ్ ఇవే అత్యధికం. ఇదిలా ఉండగా.. 24గంటల వ్యవధిలో 70,226 టెస్టులు చేయగా.. 11,486 మందికి పాజిటివ్ గా తేలింది.