ఉత్తరప్రదేశ్ లో అధికారంలోకి రావాలని కలలు కంటున్నసమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు,మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. ఆయన మైన్ పురి జిల్లాలోని కర్హాల్ స్థానం నుంచి పోటీ చేయనున్నారని ఆ పార్టీ ఎంపీ రాంగోపాల్ యాదవ్ ప్రకటించారు.
ప్రస్తుతం ఎంపీగా ఉన్న అఖిలేష్ ఇప్పటివరకు ఎమ్మెల్యేగా బరిలో నిలవలేదు. 2012లో ఎమ్మెల్సీ హోదాలోనే ముఖ్యమంత్రిగా పనిచేశారు. అటు సీఎం యోగి గోరఖ్ పూర్ నుంచి పోటీ చేయనున్నారు.