వాహనదారులపై మళ్లీ పెట్రో పిడుగు పడనుంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 4 వారాల్లో ఏకంగా 25 శాతం పెరిగి ఏడేళ్ల గరిష్ఠానికి చేరుకుంది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ చుక్కలనంటే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.
గతేడాది దేశంలో పెట్రోల్ లీటర్ రూ.110 దాటడంతో వాహనదారులు బెంబేలెత్తారు. తర్వాత కాస్త తగ్గడంతో ఉపశమనం లభించినా.. ఇప్పుడు మళ్లీ రేట్లు పెరిగితే సామాన్యులపై భారం తప్పదు.