ప్రస్తుత కరోనా థర్డ్ వేవ్ వ్యాక్సినేషన్ తో మరణాలు గణనీయంగా తగ్గాయని కేంద్రం వెల్లడించింది. సెకండ్ వేవ్ ఏప్రిల్ 30న 3,86,452 కొత్త కేసులు, 3,059 మరణాలు నమోదయ్యాయని తెలిపింది. అప్పటికి 2% మాత్రమే వ్యాక్సినేషన్ పూర్తయిందని పేర్కొంది. తాజాగా జనవరి 20న 3,17,532 కేసులు, 380 మరణాలు నమోదయ్యాయని తెలిపింది. 72 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి కావడంతో మరణాల సంఖ్య భారీగా తగ్గిందని పేర్కొంది.