రైల్వే లైన్ల మంజూరులో తెలంగాణకు అన్యాయం జరుగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోందని ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోదక్కుమార్ అన్నారు.
‘రాష్ట్రానికి రైల్వే లైన్లు మంజూరు చేయాలి. తెలంగాణ దేశంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం. దేశంలోని పలు ప్రాంతాల నుంచి TSకు పెద్ద ఎత్తున వలస వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కొత్త రైల్వే లైన్లు అవసరం’ అని రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్కు వినోద్ లేఖ రాశారు.