దేశంలో టీనేజర్ల వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. 15-18 ఏళ్ల మధ్య వారిలో ఇప్పటివరకు 52% మందికి తొలి డోసు తీసుకున్నారని కేంద్రం తెలిపింది. టీనేజర్లకు పంపిణీలో ఏపీ టాప్లో ఉంది..
91% మంది టీనేజర్లకు ఏపీలో వ్యాక్సిన్ వేసినట్లు పేర్కొంది. ఆ తర్వాత 83% మందికి వ్యాక్సిన్తో హిమాచల్ ప్రదేశ్ రెండో స్థానంలో, 71%తో మధ్యప్రదేశ్ 3వ స్థానంలో ఉంది. 55% మందికి టీకా ఇవ్వడంతో తెలంగాణ 19వ స్థానంలో నిలిచింది.