సుకుమార్ దర్శకత్వంలో ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన పుష్ప సినిమా తర్వాత మరో పాన్ ఇండియా మూవీకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. లైకా ప్రొడక్షన్ నిర్మించే ఈ సినిమా కోసం బన్నీ ఏకంగా రూ.75 కోట్ల రెమ్యునరేషన్ అడిగినట్లు వార్తలొస్తున్నాయి. అందుకు ఆ సంస్థ కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్ డైరెక్టర్లు అట్లీ, మురుగదాస్లలో ఒకరు ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం.