దివంగత సీడీఎస్ బిపిన్ రావత్ సోదరుడు విజయ్ రావత్ బీజేపీలో చేరారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ సమక్షంలో పార్టీ కండువా కప్పుకొన్నారు. సైన్యంలో కల్నల్ విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన ఆయన ప్రధాని మోదీ ఆలోచనా విధానం నచ్చే కమలం పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. త్వరలో జరగనున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనను బరిలో దింపే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
