రిలయన్స్ జియో నవంబర్ 20.19 లక్షల మంది యూజర్లను సొంతం చేసుకుంది. దీంతో ఆ కంపెనీ 42.8 కోట్ల మంది వినియోగదారులతో ప్రథమ స్థానంలో నిలిచింది. స్పెక్ట్రం కేటాయింపులకు సంబంధించి రూ. 30,791 కోట్ల బకాయిలను కేంద్ర ప్రభుత్వానికి చెల్లించింది. ఎయిర్టెల్కు కొత్తగా 13.18 లక్షల మంది చందాదారులు చేరగా, వొడాఫోన్ ఐడియా 18.97 లక్షల మంది యూజర్లను కోల్పోయింది.
