గోవా అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన, ఎన్సీపీ కలిసి పోటీ చేయనున్నాయి. మహారాష్ట్రలో అధికార మహావికాస్ అఘాడీలో భాగమైన ఆ పార్టీలు కాంగ్రెస్ లేకుండానే కూటమిగా ముందుకెళ్తున్నాయి. గెలిచేందుకు అవకాశమున్న సీట్లను తమకు కేటాయించాలని శివసేన కోరగా, కాంగ్రెస్ నిరాకరించినట్లు సమాచారం. తమతో జట్టుకట్టకపోవటం కాంగ్రెస్ దురదృష్టమని, గోవా ఎన్నికల్లో తమ బలాన్ని చూపుతామని శివసేన నేత సంజయ్ వ్యాఖ్యానించారు.
