మూడు వన్డేల సీరిస్ లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో 31 పరుగుల తేడాతో భారత్ పరాజయం పాలైంది. సఫారీ బౌలర్ల దాటికి 265/8 పరుగులకే పరిమితం అయ్యింది. చివర్లో శార్థూల్(50*) పోరాడినా విజయాన్ని అందించలేకపోయాడు. ధావన్ 79, కోహ్లి 51 పరుగులతో రాణించినా మిగతా బ్యాట్స్మెన్ తక్కువ స్కోరుకే వెనుదిరగడంతో ఓటమి పాలైంది. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి, షంసీ, ఫెహ్లుక్వాయో తలో 2వికెట్లు తీయగా, మహరాజ్, మార్క్రమ్ చెరో వికెట్ తీశారు.
