తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల డీఏ సుమారుగా 10.01 శాతం పెరగనుండగా.. 2021 జూలై 1 నుంచి పెరిగిన డీఏ వర్తించనుంది. ఈ నెల వేతనంతో కలిపి పెరిగిన డీఏ అకౌంట్లో జమ కానుండగా.. 2021 జూలై నుంచి బకాయిలు జీపీఎఫ్ ప్రభుత్వం జమ చేయనుంది. ఇటీవల కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
