బరువు తగ్గాలంటే కష్టంగానీ పెరగడానికి ఏముందిలే అనుకుంటే పొరపాటే. ఏది పడితే అది తింటే బరువు పెరగడం ఏమోగానీ ఊబకాయులుగా మారుతారు. అందుకే ఆరోగ్యంగా బరువు పెరగాలంటే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం సమయానికి తినాలి.
మధ్య మధ్య లో పండ్లు, ఇతర స్నాక్స్ తీసుకోండి. కానీ అందులో జంక్ ఫుడ్ చేర్చవద్దు. ఇక పాల ఉత్పత్తులు, ఆకుపచ్చ కూరగాయలు, సలాడ్లు తినండి. తరచూ ఇవి తీసుకోవడం వల్ల బరువు, రోగనిరోధక శక్తి పెరుగుతాయి.