పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ వలసలు జోరుగా సాగుతున్నాయి. ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ జోగిందర్ జశ్వంత్ సింగ్ బీజేపీలో చేరారు. ఈయన 2017 శిరోమణి అకాలీదళ్ చేరి… అప్పటి కాంగ్రెస్ నేత, మాజీ సీఎం అమరీందర్‌పై పటియాలా నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
జోగిందర్ 2005 నుంచి 2007 వరకు ఆర్మీ చీఫ్ గా పనిచేశారు. 2008-13 మధ్య అరుణాచల్ గవర్నర్ గా ఆయన సేవలందించారు.