కరోనా చికిత్సలో స్టెరాయిడ్స్ ను ఉపయోగించవద్దని కేంద్రం స్పష్టం చేసింది. ఈమేరకు తాజాగా సవరించిన మార్గదర్శకాలను ఐసీఎంఆర్ విడుదల చేసింది. రోగికి స్టెరాయిడ్స్ అధిక మోతాదులో ఇవ్వడంతో బ్లాక్ ఫంగస్ వంటి సెకండరీ ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు కొవిడ్ సోకిన వారికి రెండు, మూడు వారాల కంటే ఎక్కువ కాలం దగ్గు ఉంటే టీబీ, ఇతర పరీక్షలు చేయాలని సూచించింది.
