ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన కొత్త పీఆర్సీపై ఉత్తర్వులు చూసి ఉద్యోగులు షాకవుతున్నారు.
సర్కారు ఉద్యోగుల HRAలో కోత విధించింది. సచివాలయం, HOD ఉద్యోగుల HRA 30% నుంచి 16 శాతానికి తగ్గించింది. మిగతా ప్రాంతాలకు 8శాతంగా నిర్ణయించింది.
రిటైర్డ్ ఉద్యోగులకు 80 ఏళ్లు దాటాకే అదనపు పెన్షన్ ఇవ్వనుంది. పాత శ్లాబ్లను రద్దు చేసింది. గతంలో ఇచ్చిన CCAను రద్దు చేసింది. ఇకపై పదేళ్లకు ఒకసారే వేతన సవరణలు చేయనున్నట్టు పేర్కొంది.