ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కరోనా బారీన పడిన సంగతి తెల్సిందే. ఈ విషయం గురించి చంద్రబాబే స్వయంగా ట్విట్టర్ వేదికగా తెలిపారు.
ఈ క్రమంలో ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి స్పందిస్తూ చంద్రబాబు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
కోవిడ్ నుంచి త్వరగా కోలుకొని పూర్తి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈమేరకు మంగళవారం ట్వీట్ చేశారు.