ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ-రాష్ట్రీయ లోక్ దళ్ కూటమికి మద్దతిస్తున్నట్లు భారతీయ కిసాన్ యూనియన్ అధినేత రాకేశ్ టికాయత్ ప్రకటించారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది పాటు జరిగిన రైతుల ఉద్యమంలో టికాయత్ కీలకపాత్ర పోషించారు.
సాగు చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకున్నప్పటికీ తమ ఉద్యమం ఆపబోమని ప్రకటించిన టికాయత్.. ఉత్తరప్రదేశ్ లో ప్రస్తుత అధికార బీజేపీ వ్యతిరేక పార్టీకి మద్దతిచ్చారు.