తెలంగాణ ప్రాంతానికి చెందిన రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ త్వరలో సొంతగూటికి వెళ్లనున్నారు.
ఈనెల 24న సోనియాగాంధీ సమక్షంలో కాంగ్రెస్లో చేరే అవకాశం కనిపిస్తోంది. గతంలో P.C.C అధ్యక్షుడిగా, మంత్రిగా కాంగ్రెస్లో కీలక పాత్ర పోషించిన ఆయన 2015లో తెరాసలో చేరారు.
తెరాస నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన డీఎస్.. కొంత కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ కాంగ్రెస్లో చేరాలని నిర్ణయించుకున్నారు.