తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా చెన్నూరులో కండక్టర్ కి కరోనా సోకడం ఆందోళన కలిగిస్తోంది.
హన్మకొండ-చెన్నూరు RTC బస్సులో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కండక్టర్.. ప్రయాణికులు దిగాక డ్రైవర్ తో కలిసి టీ తాగారు.
ఆ దగ్గర్లోనే ఉన్న కరోనా నిర్ధారణ పరీక్ష కేంద్రం చూసి.. ఎలాంటి లక్షణాలు లేకపోయినా కరోనా టెస్టు చేయించుకున్నారు. ఆ పరీక్షల్లో ఆమెకు పాజిటివ్ తేలగా.. ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు.