దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి.
వీకెండ్ కర్ఫ్యూ, ముందస్తు ఆంక్షలు వంటి కారణాలతో కేసులు తగ్గినట్లు మంత్రి సత్యేందర్ జైన్ వెల్లడించారు. మరో 3-4 రోజులు గమనించి.. కేసులు 15వేలకు చేరినప్పుడు ఆంక్షలు సడలిస్తామన్నారు.
గత నెల రోజుల్లో రోజుకు 60 వేల నుంచి లక్ష వరకు పరీక్షలు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. కాగా ఢిల్లీలో నిన్న 20,718 కరోనా కేసులు నమోదు కాగా.. ఇవాళ 18,286 కేసులు నమోదయ్యాయి.