తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ మేరకు మంత్రులు, అధికారులు ప్రగతి భవన్‌కు చేరుకున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, నియంత్రణ తీసుకోవాల్సిన చర్యలు, దవాఖానల్లో వసతులు, ఆక్సిజన్, మందుల లభ్యత, వ్యాక్సినేషన్ ప్రక్రియ, ఆసుపత్రుల్లో మెరుగుపరచాల్సిన మౌలిక వసతులపై మంత్రిమండలి చర్చించనున్నది.
కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం జిల్లాల, జోన్ల కేటాయింపులు పూర్తయిన నేపథ్యంలో వచ్చిన అప్పీళ్లు, స్పౌజ్ కేసులు, ఉద్యోగాల ఖాళీలు, నోటిఫికేషన్ల ప్రక్రియ తదితర అంశాలపై కేబినెట్‌లో చర్చకు రానున్నట్లు తెలుస్తోంది.
ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర ఎంపీలు అనుసరించాల్సిన వైఖరిపైతో పాటు ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం కొర్రీలు.. ఎరువుల ధరల అంశంపై చర్చకు వచ్చే అవకాశం ఉన్నది.