సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉందని ఆమె సోదరి ఉషా మంగేష్కర్ తెలిపారు.
ఆమెకు స్వల్పంగా న్యూమోనియా లక్షణాలు ఉండగా తగ్గిపోయాయని, కరోనా ఆమెపై ఎలాంటి ప్రభావం చూపలేదని స్పష్టం చేశారు.
ప్రస్తుతం లత కోలుకుంటున్నారని, ఒకట్రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అవుతారని ఉషా తెలిపారు. కాగా, కొవిడ్ నిర్ధారణ కావడంతో లతా మంగేష్కర్ని ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో చేర్చారు.