తెలంగాణ రాష్ట్రంలో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోందని హెల్త్ డైరెక్టర్ జి శ్రీనివాసరావు తెలిపారు.
ప్రజలు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ పోతే.. ఈ నెల చివరి నాటికి రాష్ట్రంలో రోజుకు 50 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతాయని హెచ్చరించారు.
ప్రజలు నిబంధనలు పాటించాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ గుంపుల్లోకి వెళ్లకూడదని సూచించారు. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 18వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు.