తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.మెగాస్టార్ చిరంజీవి ఏపీ అధికార వైసీపీ అధినేత,సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని కలిసిన సంగతి తెల్సిందే. అప్పటి నుండి మెగాస్టార్ కు రాజ్యసభ సీటు ఖరారైందని వార్తలు చక్కర్లు కొట్టాయి..
దీంతో తనకు రాజ్యసభ సీటు అన్న వార్తలను ఖండించారు మెగాస్టార్ చిరంజీవి.. మరోసారి ఈ అంశంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. తెలుగు సినీ పరిశ్రమ మేలుకోసం.. సీఎం జగన్ ను కలిస్తే దాన్ని పక్కదోవ పట్టించే విధంగా.. ఆ మీటింగ్ కి రాజకీయరంగు పులుముతున్నారని అన్నారు.
రాజకీయాలకు దూరంగా ఉంటున్న తాను.. మళ్లీ రాజకీయాల్లోకి, చట్టసభల్లోకి రావటం జరగదని స్పష్టం చేశారు. దయచేసి ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని కోరారు.