ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి చెందిన కార్యకర్తలు రెండేళ్లు ఓపిక పట్టాలని ఆ పార్టీ అధినేత,మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
హత్యకు గురైన టీడీపీకి చెందిన సీనియర్ నేత తోట చంద్రయ్య కుటుంబాన్ని ఆ పార్టీ అధినేతగా నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. అంతకుముందు ఆయన చంద్రయ్య పాడే మోశారు.
‘ఈ హత్యపై సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఇప్పటికే 33మంది టీడీపీకి చెందిన కార్యకర్తలను, నాయకులను పొట్టన పెట్టుకున్నారు. ఇకనైనా నీ మనుషుల్ని కంట్రోల్ చేసుకో జగన్ మోహన్ రెడ్డి.. లేకపోతే తర్వాతి పరిణామాలకు మీరే బాధ్యులు’ అని ఆయన హెచ్చరించారు.