ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లోని పిల్లల్లో కరోనా కేసులు నిర్ధారణ అవుతున్నట్లు వైద్యులు తెలిపారు.
కడుపు నొప్పి, వాంతులు వంటి లక్షణాలు ఉన్న కొందరు చిన్నారులను టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో ఐదుగురు చిన్నారులు చికిత్స పొందుతున్నారు..
ఇద్దరికి ఆక్సిజన్ చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. పిల్లల్లో 101-102 డిగ్రీల జ్వరం, 3 విరేచనాలు వంటి లక్షణాలు ఉంటే టెస్టు చేయించాలని సూచిస్తున్నారు.