ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న ఒమిక్రాన్ వేరియంటు కి మార్చి నాటికి టీకాను తీసుకురానున్నట్లు ఫైజర్ కంపెనీ తెలిపింది.
ఇప్పటికే తాము తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ను ప్రపంచ దేశాలు వినియోగిస్తున్నాయని వెల్లడించింది.
ఇప్పుడు మహమ్మారి నుంచి రక్షణ పొందేందుకు ఫైజర్ నుంచి రెండు డోసుల టీకాతో పాటు బూస్టర్ డోసు అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది. వ్యాక్సిన్ను తీసుకోవడంతో పాటు ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించాలని తెలిపింది.