ఏపీ అధికార వైసీపీకి చెందిన సీనియర్ నేత, మంత్రి కొడాలి నాని కరోనా బారిన పడ్డారు.
దీంతో ఆయన హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. నాని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
అటు టీడీపీ నేత వంగవీటి రాధాకు సైతం కరోనా సోకింది. స్వల్ప లక్షణాలున్నాయి. ఆయన కూడా ఏఐజీ ఆస్పత్రిలో చేరారు.