సాధారణంగా ద్రాక్షతో వైన్ తయారుచేస్తారు. మరి ద్రాక్ష ఉత్పత్తి సరిగా లేకపోతే వేరే పండ్లతో వైన్ తయారుచేయలేమా? అనే ఆలోచన యూపీ ఎక్సైజ్ శాఖకు వచ్చింది. వినూత్నంగా ఆలోచించి.. తమకు అందుబాటులో ఉన్న మామిడి పండ్లతో వైన్ తయారుచేయాలని నిర్ణయించింది. ఇందుకోసం మద్యం విధానాన్ని సవరించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఆమోదం పొందగానే మ్యాంగో వైన్ తయారీ ప్రారంభం కానుంది.
