వరుస సినిమాల్లో విభిన్న పాత్రలతో ఆకట్టుకుంటున్న సమంత మరో నెగెటివ్ రోల్లో అభిమానులను అలరించనుందట.’పుష్ప’లో ఐటం సాంగ్ చేసి ఫ్యాన్స్ను ఉర్రూతలూగించగా.. హాలీవుడ్ మూవీ ‘అరెంజ్మెంట్స్ ఆఫ్ లవ్’లో బై-సెక్సువల్ పాత్ర పోషిస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది.
ఇక తాజాగా విఘ్నేష్ శివన్ డైరెక్షన్లో విజయ్ సేతుపతి, నయనతార జంటగా తమిళ్ తెరకెక్కుతున్న ‘కాత్తువాక్కుల రెండు కాదల్’ సినిమాలో సామ్ నెగెటివ్ షేడ్స్లో నటించనుందట.