ఇటీవల విడుదలై ఘనవిజయం సాధించిన సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప పార్ట్-1తో సక్సెస్ అందుకున్న నేషనల్ క్రష్ రష్మిక.. రెండో పార్ట్ కోసం భారీగా రెమ్యునరేషన్ పెంచేసిందని టాలీవుడ్ టాక్. పార్ట్-1 కోసం రూ.2 కోట్లు తీసుకున్న ఈ అమ్మడు.. రెండో భాగం కోసం రూ.3 కోట్లు డిమాండ్ చేస్తోందట. అందుకు ప్రొడ్యూసర్లు సైతం ఓకే చెప్పారని సమాచారం. కాగా పుష్ప పార్ట్-2 షూటింగ్ ఈ ఫిబ్రవరి నుంచి షురూ చేస్తామని డైరెక్టర్ సుకుమార్ ఇప్పటికే ప్రకటించాడు.
Tags allu arjun film nagar film news filmcity films movie adda movie news movies moviesadda pushpa rashmika mandana slider sukumar Telugu Movies