ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్లో వెల్లడించాడు. కొవిడ్ లక్షణాలు స్వల్పంగా ఉన్నట్లు చెప్పాడు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పేర్కొన్నాడు. అభిమానులు ఆందోళన చెందాల్సిన పనిలేదనితెలిపాడు. తనతో సన్నిహితంగా ఉన్నవారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశాడు. కాగా గతంలో కూడా బండ్ల గణేష్‌కు కరోనా వచ్చి కోలుకున్నాడు.
