ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన భవిష్యత్ కార్యాచరణపై స్పందించాడు. తనకు రాజకీయాల గురించి తెలియదని, క్రికెట్‌తో సంబంధమున్న వ్యవహారాల్లోనే కొనసాగుతానని తెలిపాడు.
అయితే కామెంటేటర్‌గా మారడమా.. మెంటార్‌గా వ్యవహరించడమా అనేది త్వరలో ప్రకటిస్తానని పేర్కొన్నాడు. కాగా, 2016లో భారత్ తరఫున చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన భజ్జీకి తరువాత జట్టులో చోటు దక్కలేదు.