దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 1,79,723 కరోనా కేసులు, 146 మరణాలు నమోదయ్యాయి. నిన్నటి (1.59 లక్షలు)తో పోలిస్తే కేసులు పెరగ్గా, మరణాలు 327 నుంచి 146కు తగ్గాయి. 46,569 మంది కోలుకున్నారు.
దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 13.29 శాతానికి పెరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 7,23,619 ఉన్నాయి. నిన్న ఒక్కరోజే 29,60,975 డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. ఒమిక్రాన్ కేసులు 4033కు చేరాయి.